IND vs AUS: టీ20లు భారత జట్టుకు కలిసి రావడం లేదు. ఆసియా కప్ సూపర్ 4 నుంచి ఇదే కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడం ఆ తర్వాత బౌలింగ్‌తో కట్టడి చేయలేకపో తేలిపోవడం టీమిండియా సర్వ సాధారణమవుతోంది. నిన్న మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. మరి ముఖ్యంగా 18,19, 20 ఓవర్లలో దారుణంగా పరుగులు ఇస్తున్నారు.
18,19 ఓవర్లలో అద్భుత బంతులు సంధిస్తే చివరి ఓవర్లలో ఒత్తిడి పెరుగుతుందని..ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు సాధించి గెలవొచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఐతే దీనికి విరుద్ధంగా టీమిండియా బౌలింగ్ కొనసాగుతోంది. 18,19 ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చి..మ్యాచ్‌ను చేజార్చుకుంటోంది. ఆసియా కప్ సూపర్-4లో ఇదే జరిగింది. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌లో 19 ఓవరే టీమిండియా కొంప ముంచింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 18,19 ఓవర్లే దెబ్బతిశాయి.
ఈక్రమంలో భువనేశ్వర్ బౌలింగ్‌పై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి బౌలింగ్ చూస్తుంటే ఆందోళన కల్గుతోందన్నాడు. మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు, బౌలర్లు టవల్ వాడటం లేదని..అందువల్లే బంతి జారిపోతోందన్నాడు. బంతిని ఎప్పటికప్పుడు తుడూస్తూ ఉండాలని..అలాంటప్పుడే బంతిని అద్భుతంగా సంధించవచ్చని తెలిపాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారని..డెత్ ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చారన్నాడు.
భారీ అంచనాలు ఉన్న భువనేశ్వర్ సైతం సరైన బంతులు వేయలేపోయాడని చెప్పాడు సునీల్ గావస్కర్. ఆసియా కప్‌లోనూ ఇదే జరిగిందన్నాడు. శ్రీలంక, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లపై చివరి 18 బంతుల్లో 49 పరుగులు ఇచ్చారని గుర్తు చేశాడు. ఒక్క బంతికి దాదాపు మూడు పరుగులు ఇచ్చినట్లు ఉందన్నాడు. డెత్ ఓవర్లలో 30 నుంచి 35 పరుగులు ఇస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో భువీకి బౌలింగ్ ఇవ్వడం ఆందోళన కల్గిస్తోందన్నాడు.
టీ20 ప్రపంచకప్ ముందు దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. దీనిపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగి సరిదిద్దుకోవాలని తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నిన్న మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.2 ఓవర్లో 211 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. డెత్ ఓవర్లలో ఆసీస్ ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి..జట్టును గెలిపించారు.
Also read:Telangana Congress: రాహుల్ గాంధీయే బాస్‌గా ఉండాలి..తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం..!
Also read:Bathukamma Sarees: బతుకమ్మ చీరల పంపిణీకి అంతా రెడీ..ఈసారి ఎంతమందికంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.