Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ అలా చేస్తేనే.. సచిన్ 100 సెంచరీలు అందుకోగలడు: సునీల్ గవాస్కర్

Virat Kohli is just 3 ODI hundreds away from equalling Sachin Tendulkar record. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డుకు కేవలం మూడు అడుగుల దూరంలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 16, 2023, 12:24 PM IST
  • విరాట్ కోహ్లీ అలా చేస్తేనే
  • సచిన్ 100 సెంచరీలు అందుకోగలడు
  • వన్డేల్లో 46వ శతకం
Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ అలా చేస్తేనే.. సచిన్ 100 సెంచరీలు అందుకోగలడు: సునీల్ గవాస్కర్

Virat Kohli to get 100 international centuries if he play next 5-6 years: తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి మైదానంలోని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. 110 బంతుల్లో 166 పరుగుల బాదాడు. విరాట్ ఇన్నింగ్స్‌ లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీకి ఇది 74వ సెంచరీ కాగా.. వన్డేల్లో 46వ శతకం. శ్రీలంక వన్డే సిరీస్‌లో రెండో సెంచరీ కాగా.. గత 4 వన్డేల్లో మూడో సెంచరీ కావడం మరో విశేషం.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డుకు కేవలం మూడు అడుగుల దూరంలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 46 శతకాలతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023 సహా ఇతర సిరీస్‌లు ఉన్నాయి. కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. సునాయాసంగా సచిన్ రికార్డును దాటేస్తాడు. అయితే అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును అధిగమించాలంటే మాత్రం కోహ్లీ ఇంకా చాలానే సమయం పట్టే అవకాశం ఉంది. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 74 శతకాలు నమోదు చేశాడు. 

విరాట్ కోహ్లీ ఇదే ఫామ్‌ను మరికొన్నేళ్ల పాటు కొనసాగిస్తేనే సచిన్‌ టెండూల్కర్ రికార్డును చేరుకుంటాడు అని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. 'ఇదే పరుగుల దాహంతో మరికొన్నేళ్ల పాటు ఆడగలిగితే సచిన్‌ శతకాల రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ వయస్సు 34. కనీసం 5-6 ఏళ్ల పాటు ఆడాలి. అప్పుడు 100 సెంచరీలు కొట్టడం అసాధ్యమేమీ కాదు. సంవత్సరానికి 6  సెంచరీల లెక్కన బాదితే.. ఐదారేళ్లలో 26 శతకాలు కొట్టేయగలడు. అలా జరగాలంటే.. కోహ్లీ 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాలి' అని సన్నీ అన్నారు. 

'సచిన్‌ టెండూల్కర్ కూడా 40 ఏళ్ల వరకు ఆడాడు. ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ కోహ్లీ పూర్తి స్పష్టతతో ఉంటాడు. వికెట్ల మధ్యలో అత్యంత వేగంగా పరిగెత్తగలడు. గతంలో ఎంఎస్ ధోనీ కూడా చాలా ఫిట్‌గా ఉండేవాడు.  అంతేకాదు వేగంగా పరుగెత్తేవాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా మలచడంలో మహీ ముందుండేవాడు. విరాట్ తన ఫిట్‌నెస్‌తో మరో ఐదారేళ్లు కచ్చితంగా ఆడగలడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు' అని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 

Also Read: Virat Kohli Fan: మైదనంలోకి దూసుకొచ్చి.. విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకున్న అభిమాని! సూర్య భాయ్ ఏం చేశాడంటే  

Also Read: IND vs SL: మూడో వన్డేలో భారత్‌ విజయం.. 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ! నమోదయిన రికార్డులు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News