శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడా..!

శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ లో అడుగుపెట్టబోతున్నాడా..! గురువారం శ్రీశాంత్ మైదానంలో మ్యాచ్ ఆడాడు.

Updated: Aug 10, 2018, 04:34 PM IST
శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడా..!

శ్రీశాంత్ మళ్లీ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్నాడా..! గురువారం శ్రీశాంత్ మైదానంలో మ్యాచ్ ఆడాడు. ఐతే ఇది అధికారిక మ్యాచ్‌లు కాదండోయ్. ఏదో క్లబ్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేశాడు. అయితే అది ఏ క్లబ్, ఎక్కడ అనే వివరాలు తెలియరాలేదు. కానీ మ్యాచ్ ఆడిన ఫోటోలును, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియాలోకి 'ఎప్పుడు వస్తున్నావు.. ఆల్‌ ది బెస్ట్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

#discipline #Cricket

A post shared by Sree Santh (@sreesanthnair36) on

 

2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జైలుకెళ్లొచ్చిన శ్రీశాంత్ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడిని టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడించేందుకు బీసీసీఐ అనుమతించడం లేదు. బీసీసీఐ నిషేధాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు శ్రీశాంత్ మీదున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. అయినా బీసీసీఐ మాత్రం శ్రీశాంత్‌ను టీమిండియా తరఫున ఆడించడం లేదు.

శ్రీశాంత్ కొన్ని నెలల క్రితమే మాలీవుడ్(కేరళ సినీరంగం)లో అడుగుపెట్టాడు. నాలుగు సినిమాలు పూర్తిచేసుకున్న శ్రీశాంత్.. ఇప్పడు ఐదో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు.