'కరోనా వైరస్' .. అగ్రరాజ్యం అమెరికాను కుదుపేస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న వైరస్.. అమెరికాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చైనా, ఇటలీ,స్పెయిన్ కంటే కరోనా వైరస్ మృతులు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికా అంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ లాక్ డౌన్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటికే ఊళ్లు, పట్టణాల మధ్య చిచ్చు పెట్టిందీ మహమ్మారి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీలు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కారణంగా.. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కొత్త రగడ మొదలవుతోంది.
మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది 'కరోనా వైరస్'. దాని దెబ్బకు అగ్రరాజ్యం నుంచి అతి చిన్న దేశం దాకా గజగజలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రపంచ మానవాళి.. అంతా చిగురుటాకులా వణుకుతున్నారు. లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అంతే దాదాపు 11 లక్షలకు పైగా కరోనా బారిన పడ్డవారు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
'కరోనా వైరస్'..కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పేద వారికి పట్టెడన్నం దొరకని పరిస్థితి నెలకొంది. పట్టణపేదలకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు ఆహారం లేదా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయి.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'కరోనా వైరస్'.. మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
20 ఏళ్ల క్రితం 'జలదృశ్యం'లో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు దాటుకుని .. లక్ష్యసాధన పూర్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి.. !! తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ. మలిదశ ఉద్యమానికి నాంది పలికి పురుడు పోసుకున్న పార్టీ.. రేపటి (సోమవారం) తో 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండోసారి తెలంగాణ అధికార పీఠాన్ని చేజిక్కించుకుని పాలన సాగిస్తోంది.
'కరోనా వైరస్'.. మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ..కరోనా దెబ్బతో విలవిలలాడుతోంది. చివరకు చైనా, ఇటలీ, స్పెయిన్ కంటే దారుణంగా కరోనా మహమ్మారి దెబ్బకు బలైపోతోంది.
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అప్పుడే కరోనా వైరస్ లొంగి వస్తుందని పేర్కొన్నారు.
టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'శివమణి'. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం మళ్లీ అందరికీ గుర్తుకు వస్తోంది. భవిరి రవి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన ఓ పేరడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే అందుకు కారణం.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు శరవేగంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు సామూహికంగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది.
'కరోనా వైరస్'.. మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తూ.. భయాందోళన సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు లక్షణాలు లేకుండా వస్తున్న కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయి.
'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ లొంగిరాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ సర్కారు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఐతే ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో... ముస్లింల కోసం ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ మృత్యుకేళీ ఆడుతోంది. ఇప్పటి వరకు లేని కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 24 గంటల్లోనే మరణాల సంఖ్య 57కు చేరడం గుబులు రేకెత్తిస్తోంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి లాక్ డౌన్ విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న వేళ.. పరిమిత ఆంక్షలతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది కేంద్రం.
'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.