'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు సామూహికంగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది.
మరోవైపు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 64వసారి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి లాక్ డౌన్ అమలు చేశారు. ఐతే కరోనా మహమ్మారి లొంగిరాకపోవడంతో లాక్ డౌన్ పొడగించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. పరిమిత ఆంక్షలతో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 26 వేలు దాటింది. మొత్తం 26 వేల 496 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అందులో 824 మంది ఆ మహమ్మారికి బలయ్యారు.
ఈ నెల చాలా ఇన్ పుట్స్ ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్ కోసం అందరూ వేచి చూడాలని కోరారు. ఈ క్రమంలో ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించడం ఇది రెండోసారి. 63వ మన్ కీ బాత్ లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సిన తీరు గురించి వివరించారు. అంతే కాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందుకు ప్రజలను క్షమాపణలు కూడా కోరారు. కానీ జీవన్మరణ సమస్యగా తయారైన కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరి పరిస్థితి అని వివరించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామూహిక యుద్దం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ఏం చెప్పనున్నారు..?