Amaravati land scam: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి భూ కుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘం దర్యాప్తు పూర్తయింది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది..ఆ వివరాలేంటి..
AP Roads: ఆంధ్రప్రదేశ్‌లో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి త్వరలో విముక్తి కలగనుంది. రోడ్ల మరమ్మత్తు పనుల్ని యుద్ద ప్రాతిపదికన భారీ ఎత్తున చేపట్టనుంది ప్రభుత్వం. 2 వేల కోట్లతో మరమ్మత్తు పనుల కోసం టెండర్ నోటిఫికేషన్ వెలువడింది.
Ysr congress party victory: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
Ap SSC Exam 2021: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కాంబినేన్స్ నామినల్ రోల్స్, లాంగ్వేజెస్ విషయంలో కీలకమైన మార్పులతో ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది.
AP JOBS Good News: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 8 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
Ys jagan Review: వేసవి విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Ap Government: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రధానికి జగన్ మరోసారి లేఖ రాసి..పునరుద్ధరణకు సూచనలు చేసినట్టు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Vizag steel plant: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సమస్యను విన్నవించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీ అప్పాయింట్మెంట్ కోరారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Vizag steel plant privatisation: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.
Free Sanitary Napkins: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్య రక్షణ, విద్యకు విఘాతం లేకుండా ఉండేందుకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రారంభించనున్నారు.
Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.
AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తక్షణం కోర్టు ముందు ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులను హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
Maritime India 2021: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఖమైన తీరమే దీనికి కారణమని మారిటైమ్ ఇండియా 2021 సదస్సు నేపధ్యంలో తెలిపారు.
Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్‌న్యూస్ విన్పించారు.
SEC vs Nominations: ఆయన తీసుకునే నిర్ణయం వివాదాస్పదమవుతుందో లేదా వివాదాస్పద నిర్ణయమే ఆయన తీసుకుంటున్నారో తెలియదు గానీ..ఏపీ ఎన్నికల కమీషనర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదమవుతోంది. ఇప్పుడు మరో నిర్ణయం వివాదంగా మారింది.
SEC on Volunteers: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వాలంటీర్లపై దృష్టి పెట్టారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు ముందుగా వాలంటీర్లే గుర్తొస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాలంటీర్లపై ఆంక్షలు విధించారు.
Amaravati region: ఏపీ శాసన రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని గుర్తు చేశారు. అమరావతిలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపధ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Ap High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారమై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేదని ఎన్నికల కమీషనర్ నివేదించింది. తదుపరి విచారణ మార్చ్ 1వ తేదీకు వాయిదా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.