Ex gratia of Rs 5 lakhs to families of deceased in AP floods: అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan ) అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు.
Heavy rains in Telangana, AP: హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల కారణంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో జనం సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు.
ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ( Heavy rain in AP) ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో రాష్ట్రం నలుమూలలా నదులు, కాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ( West Godavari ) తమ్మిలేరు, ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తున్నాయి.
Heavy rain in TS and AP: హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.