'కరోనా' సేవల కోసం రోబోలు

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేరు వింటేనే జనం ఒంట్లో నుంచి వణుకు పుడుతోంది.

Updated: Mar 29, 2020, 04:09 PM IST
'కరోనా' సేవల కోసం రోబోలు

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేరు వింటేనే జనం ఒంట్లో నుంచి వణుకు పుడుతోంది. 

'కరోనా వైరస్' విస్తరిస్తున్నా .. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వారు తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సిందే. లేని పక్షంలో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కానీ వారు కూడా మనుషులే కదా. వారికీ వైరస్ సోకే ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది.  అందుకే వైద్య సేవలు అందించేందుకు వారు కూడా భయంతో వణికిపోతున్నారు. కానీ వారు తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేస్తూ అందరి ప్రాణాలు కాపాడుతున్నారు. 

లాక్ డౌన్ విధించినందుకు క్షమించండి..!!

వారికీ ప్రాణ భయం ఉంటుంది కాబట్టి .. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి..? దీనికి ఓ పరిష్కార మార్గాన్నికనుకున్నారు తిరుచ్చిలోని ప్రొఫెలినార్ టెక్నాలజీ సంస్థ పరిశోధకులు. ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స  పొందుతున్న కరోనా వైరస్ పాజిటివ్ బాధితులకు  ఆహారం, మందులు ఇతర సదుపాయాలు అందించేందుకు ప్రత్యేకంగా రోబోలోను అభివృద్ధి చేశారు. అవి ఆయా రోగుల వద్దకు వెళ్లి వారికి మందులు, ఆహారం అందిస్తాయి. ఆ తర్వాత ప్రత్యేక శానిటైజర్ల ద్వారా ఆ రోబోలను శుభ్రం చేస్తారు. తిరిగి మరోమారు ఉపయోగిస్తారు. 

ప్రస్తుతం ఈ రోబోలను ప్రొఫెలినార్ టెక్నాలజీ  పరిశోధకులు పరీక్షించి చూశారు. అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత తిరుచ్చి  జిల్లా కలెక్టర్ వద్ద కూడా డెమో చేసి చూపించారు. త్వరలోనే వీటిని ఐసోలేషన్ వార్డుల్లో రోగుల వద్దకు పంపించి పని చేయించనున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..