''కరోనా వైరస్'' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనా, ఇటలీల్లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్యలో చైనాను దాటిపోయింది ఇటలీ. మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
అసలే ''కరోనా వైరస్'' మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పేరు వింటేనే జనం నిలువునా గజాగజా వణికిపోతున్నారు. భారత దేశంలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
కరోనా వైరస్ ఎఫెక్ట్ మందుబాబులపైనా పడింది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, థియేటర్లు, స్కూళ్లు, పార్కులు, పెద్ద పెద్ద హోటళ్లు.. ఇలా అన్ని మూతపడ్డాయి. ఐతే ఇప్పుడు ఈ ప్రభావం మందు బాబులపైనా పడింది. చాలా వరకు వైన్ షాపుల ముందు జనం లేకుండా పోయారు.
'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న మృత్యు కెరటం. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వ్యాధి ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయంటే దీని ప్రభావం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.
'కరోనా వైరస్' ప్రభావం కారణంగా. . ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి దాపురించింది.
కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 ( COVID-19) స్క్రీనింగ్ లేకుండానే భారత్కి రావడం కలకలం సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు కరోనా వైరస్ గురించే చర్చ జరుగుతోంది. కానీ అప్పట్లో 'కరోనా వైరస్' లాంటి వైరస్ లు ప్రపంచాన్ని గడగడా వణికించాయి. సార్స్, మెర్స్, ఎబోలా ఇలాంటి వైరస్ లు ఉపద్రవాన్ని సృష్టించాయి.
ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒక్కో కేసు నమోదైంది.
కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు 27 దేశాల ప్రజలు గడగడా వణుకుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చి పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది మృత్యువాతపడ్డారు.
చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.