బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్‌కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్యలపై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు
పార్లమెంట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన కామెంట్స్‌పై అగ్రనటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ( Maadhavi Latha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు.
Ganja smuggling | విజయవాడ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదంమోపిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సోమవారం భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను (Ganja peddlers) పట్టుకున్నారు. గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలతో పాటు గుట్కా అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
తిరువూరు చెక్ పోస్టు వరుసగా రెండోసారి వార్తల్లోకొచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న ఓ కారును తిరువూరు చెక్ పోస్ట్ ( Tiruvuru check post ) వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టుపడిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇదే చెక్ పోస్టు వద్ద తాజాగా ముగ్గురు విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు ( B.Tech students caught peddling Ganja ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.