భారత్‌లో కరోనాకేసులు ( Coronavirus ), మరణాల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
సిగరెట్స్, హుక్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారిన వారికి కరోనావైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
కరోనా వైరస్ (Coronavirus) నివారణ, దాని నుంచి రక్షణ కోసం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ (Aarogya setu app) లో ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను జోడించింది. ఈ యాప్ కరోనాతో పోరాడటానికి ప్రజలకు అదనపు రక్షణ కవచంలా పనిచేయనుంది. ఈ సమాచారాన్ని ప్రభుత్వం ట్వీట్ ద్వారా పంచుకుంది.
మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown)ను విధించింది. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు.
దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ (coronavirus) కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం హోమ్ క్వారంటైన్ (home quarantine) నిబంధనలను మార్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వారి పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగానే ఏదో ఒక వ్యాధి బారిన పడి బాధపడుతున్న వ్యక్తికి ఇప్పుడు కరోనా వైరస్ సంక్రమిస్తే.. వారిని హోమ్ క్వారంటైన్లో ఉండటానికి అనుమతించరు.
COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
కరోనావైరస్ పాజిటివ్‌తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకుంది. షిల్లాంగ్‌లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం వల్లనే రెండు రోజుల్లోనే దేశంలో 647 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ఒక బులెటిన్ విడుదల చేసింది. కాగా దేశంలోని 14 రాష్ట్రాలు
చైనా దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షలు చేయగా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారతదేశం కరోనావైరస్ కు సంబంధించిన మొదటి కేసును గురువారం కేరళ రాష్ట్రంలో గుర్తించారు.
రాజస్తాన్‌లోని కోటలో జెకె లోన్ ఆస్పత్రిలో గత డిసెంబర్ నుంచి మృతిచెందిన శిశువుల సంఖ్య తాజాగా 100కు చేరింది. డిసెంబర్ 30న ముగ్గురు, డిసెంబర్ 31న మరో ఐదుగురు శిశువులు మృతిచెందినట్టు ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగానికి ( Pediatric department ) అధిపతి అయిన డా అమృత్ లాల్ భైర్వ తెలిపారు. డిసెంబర్ 24 నాటికే మృతిచెందిన శిశువుల సంఖ్య 77కు చేరగా తాజాగా ఆ సంఖ్య 100కు చేరడం కలకలం రేపుతోంది. చనిపోయిన శిశువుల్లో అప్పుడే పుట్టిన వారు, రోజుల వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. చనిపోయిన శిశువులు అందరూ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు హైపోథెర్మియా ( Hypothermia ) అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు డా అమృత్ లాల్ భైర్వ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.