50ఏళ్ల తరువాత 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధాకా గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద లభ్యమైంది. మంచుకొండలపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తుండగా పర్వతారోహకులకు ఈ మృతదేహం కంటపడింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల ప్రాంతంలో టిబెటిన్ బౌద్ధగురువు దలైలామాతో భేటీ అయ్యారు. పలు వ్యక్తిగత పనుల నిమిత్తం నాలుగు రోజుల ధర్మశాల పర్యటనలో ఉన్న సచిన్, ఈ రోజు అదే ప్రాంతంలో ఓ దత్త నివాసంలో ఉంటున్న దలైలామాని కలిశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కూలు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో బస్సు డ్రైవరుతో సహా 20 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో 40 మంది బాలలు తీవ్రగాయాల బారిన పడ్డారు
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ దుమాల్ ఎన్నికల్లో పరాజయం పొందాక.. పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నిక చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉన్న పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో బీజేపీ ఇంకా మెజార్టీకి రెండు అంకెలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉంది.కౌంటింగ్ ప్రారంభమైన అర్థగంట వ్యవధిలో ఆ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే స్థాయిలో నడుస్తోంది.
గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాగా ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన గంటా.. రెండు గంటల్లోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిందీ తెలిసిపోతుంది.కాగా హిమాచల్ ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండగా 337 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో 50 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 7, 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్నికల బరిలో కేవలం 19 మంది మహిళా అభ్యర్థులు ఉండడటం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.