Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్‌లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్‌లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి తరలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట లో ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎయిర్ బేస్‌కి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది.
Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు
పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుల్వామా తరహాలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. ఈసారి కూడా మళ్లీ పుల్వామాలోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేయడం విశేషం. కానీ ముందుగానే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు భారత్ దాడికి దిగుతుందేమోనన్న అనుమానాలు దాయాది దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనుక్షణం భయంతో బతుకీడుస్తోంది నిత్యం కుట్రలు చేసే పాకిస్తాన్.
జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లో నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారన్న సమాచారం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది.. ఈ రోజు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
భారత ఆర్మీ జవానులు మరోసారి పై చేయి సాధించారు. పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్..POKలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. సరిహద్దుల్లో ముష్కర మూకలు ఏర్పాటు చేసుకున్న ఈ స్థావరాల కారణంగా .. భారత్ కు నిత్యం ప్రమాదం పొంచి ఉంది.
'కరోనా వైరస్'తో ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారుతోంది. కానీ పాకిస్తాన్ కు చీమకుట్టినట్లు కూడా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ భారత్ పై నిత్యం యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. భారత సరిహద్దు వెంబడి ఈ సమయంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటే ఏమనుకోవాలి..?
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ పుల్వామా తరహా దాడులకు కుట్ర చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత ఇంటెలిజెన్స్ అధికారులు ఇదే హెచ్చరిస్తున్నారు.
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది.
జమ్ముకాశ్మీర్ సహా సరిహద్దులన్నింటిలో ముష్కర మూకల ఆటకట్టించడానికి భారత్ మరింత శక్తి కూడగట్టుకుంటోంది. ఇందుకోసం మరోసారి అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకోనుంది. ఉగ్రవాద నిరోధక చర్యల కోసం భారత సైన్యం సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ 10,000ను సమీకరించుకోనుంది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.