ఉత్తరకొరియా నిర్వహించిన సైబర్ దాడితో కీలక రహస్యం వెలుగులోకి వచ్చింది. దేశ అధ్యక్షుడు కిమ్ మర్డర్ప్లాన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయ్..ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మర్డర్ప్లాన్ కు సంబంధించిన అంశంపై ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తన కథనం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన హత్యకు ద.కొరియా నావికదళం ప్లాన్ చేసినట్లు కథనంలో పేర్కొంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను మట్టుబెట్టడానికి అమెరికా- దక్షిణ కొరియాలు వేసిన ప్లాన్ కూడా హ్యాక్ ద్వారా లభించిన పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది.
గత కొంతకాలంగా సాగుతున్న ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అరాచక రాజకీయాలు ఎలాంటి భవిష్యత్తు మారణహోమాలకు నాంది పలుకుతాయోనని ఆయా రాజ్యాల సరిహద్దు దేశాలు కలవరపడుతున్నాయి. అమెరికాను క్షమించేది లేదని.. దాని వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 2 లక్షల మంది దేశ పౌరులు ఆర్మీలో చేరిన క్రమంలో 'యాంటీ అమెరికా వార్' అంటూ సాగిన స్లోగన్స్ మధ్య వారికోసం కిమ్ జోంగ్ ఒక ప్రత్యేక మీటింగును ఏర్పాటు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.