Modi Election Tour: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో మూడో రోజు పర్యటించారు. జగిత్యాల వేదికగా జరిగిన సభలో రాహుల్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
Telangana cantonment Bypoll: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని భాగంగా తెలంగాణలోని కంటోన్మెంట్ పరిధిలో ఏర్పడిన ఖాళీకి కూడా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈక్రమంలో తాజాగా, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Elections Commission Of India: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి నియమాలు పాటించాలో అనేక సూచనలు చేశారు.
Yusuf Pathan Political Entry: టీమిండియా రెండు సార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నాడు.
Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయనున్నాడా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Asssam APP Candidates: ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరిదైపోతున్నట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో టీఎంసీ, ఎస్పీ, ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తుండగా తాజాగా అస్సాంలోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
Barrelakka in Lok Sabha Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో అడుగు ముందుకువేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాదిరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ప్రకటించింది. ఎన్నికలు ఏదైనా నిరుద్యోగుల గొంతు విప్పేందుకు బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది.
YCP Lok Sabha Candidates List: 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలుగా ఈసారి సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల సిట్టింగ్‌ల స్థానంలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్‌పై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగూ అధికారం కోల్పోయాం కానీ కేంద్రంలో మాత్రం పట్టు కోల్పోకూడదలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై గులాబీ బాస్ దృష్టి సారించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Telangana Assembly Elections And One Nation One Election Policy : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందనగా కేంద్రం ఇలా స్పెషల్ సెషన్స్ నిర్వహించడానికి కారణం కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లాలి అని అనుకోవడమేనా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మా ఎడిటర్ భరత్ అందిస్తారు.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
Ganta Narahari Prifile: ఆ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఈ లోక్ సభ స్థానంలో రెండే సార్లు గెలిచింది. మరో రెండు సార్లు పొత్తులో బాగంగా పోటీ నుంచి తప్పుకుంది. పదేళ్లుగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా టిడిపి నుండి ఎవరూ పోటీలో లేరు... ఇప్పుడు ఆ పార్టీ తమ పార్టీ తరపున కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా అభ్యర్థి, ఏమా కథ ?
Modi's Free Mobile Recharge: 2024 లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు రూ. 239 విలువ కలిగిన మొబైల్ రీచార్జ్ ఉచితంగా అందిస్తున్నారని.. అలా చేయడం వల్ల ఆ ఉచిత మొబైల్ రీచార్జ్ లబ్ధి పొందిన వాళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారని చెబుతూ ఒక మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.