MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
Hyderabad Lok Sabha Election: దేశంలో ఎన్నికలను సజావుగా సాగేందుకు ఎన్నికల యంత్రాంగం కృషిచేస్తోందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఎన్నికలపై అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, ఓటింగ్ సమయంలో ఎలాంటి అక్రమాలు కానీ, నకీలీ ఓట్లను పూర్తిగా తొలగించినట్లు ఈసీ తెలిపింది. తెలంగాణలో 17 లోక్ సభస్థానాలకు, కంటోన్మెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనుంది.
MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
AP Election Notification: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. అటు నామినేషన్ల ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభమౌతుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు.
ABP News-CVoter Opinion Poll on Loksabha Elections 2024: దేశవ్యాప్తంగా మరోసారి ఎన్డీఎ కూటమి హవా మరోసారి కొనసాగుతుందని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది. 373 సీట్లలో ఎన్డీఎ కూటమి విజయం సాధిస్తుందని.. INDIA కూటమి 155 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఏపీలో అనూహ్యంగా ఎన్డీఎ కూటమి పుంజుకుంటుందని పేర్కొంది.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సంస్థల సర్వేలు షాక్ ఇస్తున్నాయి.
Chattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.