మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు.. అవేంటో మీరే చూడండి....
MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్, తదితర సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు.
Mohan Babu: సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబుకు విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు బదులిచ్చారు.
Bandla Ganesh campaign: మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతోన్న బండ్ల గణేశ్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ షేర్ చేశారు బండ్ల గణేశ్.
'మా' ఎన్నికలు దగ్గర పడుతున్న వేల ఇదివరకే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించాడు. మరో పోటీ దారుడు హీరో మంచు విష్ణు ఈ రోజే తన ప్యానల్ ప్రకటన చేసారు. వారి టీంలో ఎవరెవరు ఉన్నారంటే..!!
MAA Elections 2021: అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించారు. సెప్టెంబరు 23న విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
MAA Elections: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో..అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ .. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు.
Bandla Ganesh emotional comments : మా ఎన్నికల్లో పోటీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి కానీ విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అని కోరారు. ఈ మేరకు గణేశ్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.
MAA Elections: మా ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మరో సరికొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్.. ఆ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
MAA Elections 2021:మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.
MAA: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది.
'మా' లో నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ హేమ చేసిన వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ ఖండించారు. హేమ వ్యాఖ్యలు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
'మా' అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరపకుండా, తిరిగి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలే పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు.
MAA Elections 2021: టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంటాయి. నలుగురు బరిలో ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారిన నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.