Third Wave of Corona In India: దేశంలో కరోనా థార్ట్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ ఐదో కేసు భయటపడిన నేపథ్యంలో ఈ అంచనాలకు మరింత బలం చేకూరుతోందటున్నారు.
Omicron on Children: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.
TS News: దేశవ్యాప్తంగా 'ఒమిక్రాన్' భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
2022 జనవరి 10 నుంచి వర్క్‌ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని గూగుల్ నిర్ణయించింది. అయితే 'ఒమిక్రాన్' వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 10 నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది.
Delhi: ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఎనిమిది మంది చేరగా.. శుక్రవారం మరో నలుగురు చేరినట్లు సమాచారం.
Omicron scare: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తొమ్మది మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిట్వ్గా తేలింది. వారి శాంపిళ్లను ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే తదుపరి పరీక్షలకు పంపారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.
ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోనే ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ గురువారం వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరు చెందిన డాక్టర్. అయితే ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడమే ఇక్కడ గమనార్హం.
Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అది కూడా ఆ రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తించడంతో భారత సర్కారుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Omicron name meaning and why it is named Omicron: సౌత్ ఆఫ్రికాలో కొత్తగా గుర్తించిన కొవిడ్-19 వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తోంటే.. చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు ఈ కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు (Who names new variants) ? ఎలా పెడతారు, ఆ పేర్లే ఎందుకు పెడతారు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రపంచమంతా చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో నమోదైన తొలి కేసు ఇప్పుడు ఇండియాను వణికిస్తోంది.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా సోకుతుంది. కావున ఇక్కడ తెలిపిన సూచనలను పాటిస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడి.. ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
Omicron Version Vaccine: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా..ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది.
Covaxin: ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో భారీగా ఎగుమతుల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపింది.
Omicron Virus Scotland: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు దేశదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు పాకిన ఈ మహమ్మారి.. స్కాట్లాండ్ దేశంలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ దేశంలో ముగ్గురు ఒమిక్రాన్ బారిన పడినట్లు స్కాట్లాండ్ అధికారులు వెల్లడించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు నేపధ్యంలో ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఇండియా సైతం కొత్త ఆంక్షలు విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.