Basavaraj Bommai resigned to his CM Post : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపి 65 స్థానాలకే పరిమితమైంది.
Bandi Sanjay About Karnataka: కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావించిన బండి సంజయ్.. బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు తగ్గలేదు అని అన్నారు.
Karnataka New Cabinet 2023: కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కర్ణాటక కొత్త కేబినెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంల పేర్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
Karnataka Assembly Elections 2023: ఓ వైపు కర్ణాటక ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం కోరుతోంది. ప్రియాంకకు పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుంందా..?
2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీని ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలే అంటూ బాగా ఘాటుగా విమర్శలు చేసిన సంగతి.. గుజరాత్ లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ తీర్పు గురించి స్టే ఇవ్వాలి అని సూరత్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరగగా.. రాహుల్ కోరిన విజ్ఞప్తిని సూరత్ కోర్టు కొట్టేసింది.
Rahul Gandhi Eviction Notice: ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని రాహుల్ బదులిచ్చారు.
Rahul Gandhi Issue: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వరుసగా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముందు జైలు శిక్ష, తరువాత పార్లమెంట్ సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ చేయాల్సి రావడం. మోదీ ప్రభుత్వం రాహల్ గాంధీని వెంటాడుతున్నట్టే కన్పిస్తోంది.
Parliament Budget Session 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రకంపనలు పార్లమెంట్ ను తాకనున్నాయి. ఉభయ సభలు ఇవాళ స్తంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Revanth Reddy Protests Against Centre: హిండెన్‌బర్గ్ షేర్ల కుంభకోణాన్ని రాహుల్ గాంధీ బయటకు తీయడంతో పాటు ఆ విషయంపై గట్టిగా పోరాటం చేస్తుండడంతో అది తట్టుకోలేకే నరేంద్ర మోదీ సర్కారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు.
Revanth Reddy Slams PM Modi in Rahul Gandhi Issue: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా, కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని.. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని కేంద్రాన్ని నిలదీశారు.
Komatireddy Venkat Reddy About Rahul Gandhi's Disqualification: కేంద్రం రాహుల్ గాంధీపై ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు అందరూ రాహుల్ గాంధీకే అండగా ఉంటారు. ఆయనపై అనర్హత వేటు వేయడం అంటే రాజ్యాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ నరేంద్ర మోదీ సర్కారు తొందరపాటు చర్యే అవుతుంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
CM KCR On Rahul Gandhi: రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని అన్నారు.
Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది.
Bandi Sanjay On Rahul Gandhi: కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ అని.. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాతున్నారో ఆయనకే తెలియదన్నారు.
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు.
Revanth Reddy Slams KTR: బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.