తమిళనాడు రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం అని అభిప్రాయపడ్డారు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏ.ఆర్ రెహ్మాన్. తాను సంగీత పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పూర్తి చేసుకుంటూ దేశవ్యాప్తంగా లైన్ కన్సర్ట్స్ నిర్వహిస్తున్న ఈ ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఈ నెల 12వ తేదీన చెన్నైలో అక్కడి అభిమానుల ముందు పర్ఫామ్ చేయనున్నారు. తమిళనాడుపై తనకి వున్న గౌరవ భావాన్ని చాటుకుంటూ 'నెత్రు ఇంద్రు నాలై' ( నాడు నేడు రేపు) పేరిట నిర్వహించనున్న ఈ లైవ్ కన్సర్ట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంగా ఆయనతో ముచ్చటించిన మీడియా మిత్రులు..
డీఎంకే నేత కరుణానిధితో పాటు అన్నాడీఎంకే నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక, తమిళనాడులో ద్రావిడవాదానికి బదులుగా అవినీతిపై పోరాటం చేయడమే తన ఎజెండా అని చెప్పే సరికొత్త రాజకీయాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సంకేతాలు దేశ రాజకీయాలకు కూడా అందుతాయనడంలో సందేహం లేదు.
దీపావళికి బదులు 2018లో రిపబ్లిక్ డే స్పెషల్గా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశలో పడ్డారు.
శంకర్.. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండరు. సినిమాలో కధకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే ఈపాటికే అర్థమయ్యివుంటుంది. తొలి సినిమా 'జెంటిల్ మెన్' నుంచి 'ఐ' వరకు ఆయన సినిమాలే ఇందుకు నిదర్శనం. 90వ దశకంలోనే పాటలకు కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. అద్దిరిపోయే సెట్లు, అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించడం శంకర్ ఉన్న ప్రత్యేకత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.