Rythu bandhu scheme money in bank accounts: హైదరాబాద్: రైతుబంధు నిధులను పాత బకాయిల కింద సర్దుబాటు చేస్తున్న కొన్ని బ్యాంకులు.. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి అంగీకరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు నేటి నుంచి అమలుకానుంది. వర్షాకాలం దఫా నగదు నేటి నుంచి పది రోజులపాటు రైతులకు నేరుగా జమ చేస్తారు. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు కోటిన్నర ఎకరాల భూములకుగానూ రైతుబంధు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 15 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Etela Rajender Sensational Comments: సీఎం కేసీఆర్‌పై, రైతు బంధు సహా పలు అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Digital survey on agricultural lands in Telangana: హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను (Pilot digital survey of agricultural lands) చేపట్టాలన్నారు.
rythu bandhu scheme june 2021 installment money to be credited in farmers' bank accounts : హైదరాబాద్: రైతు బంధు సాయం జూన్ ఇన్స్టాల్మెంట్ విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జూన్ 15 నుంచి 25వ తేదీలోగా రైతులకు రైతు బంధు సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి రెండో విడత రైతుబంధు పథకం ప్రారంభం కానుంది. రైతుబంధు సాయాన్ని భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
Harish Rao: తెలంగాణలో రైతుబంధు, రైతుభీమా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా.. బీజేపీ ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Rythu bandhu scheme money | హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయం రాష్ట్రంలోని రైతులు అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. అంతేకాకుండా కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.