IPL Auction 2022 Unsold Players List: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరి ఆటగాళ్లపై పలు ప్రాంఛైజీలు భారీ ధర వెచ్చించగా.. మరికొందరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇందులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదారాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనాను తీసుకోనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. మిస్టర్ ఐపీఎల్ కోసం 10 నుంచి 12 కోట్ల వరకు ఖర్చు చేయనుందట.
Suresh Rains Dance: ప్రస్తుతం ప్రపంచమంతా పుష్ప మేనియా పట్టుకుంది. కొంతమంది తగ్గేదే లే అంటూ మేనరిజం చూపిస్తుంటే..మరి కొంతమంది పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేస్తున్నారు. సురేష్ రైనా వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రైనా అంటే ఫ్లవర్ కాదంటున్నారు..
ICC T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ 2021ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు.
Suresh Raina on Virat Kohlis captaincy:విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరని భావిస్తున్నాను. కానీ అతడు సాధించాల్సింది ఇంకా చాలా ఉందని సురేష్ రైనా పేర్కొన్నాడు. ఆటగాడిగా అతడు ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు, రికార్డులు తిరగరాసి ఉంటాడు. నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా అవార్డులు అందుకున్నాడు.
Suresh Raina about MS Dhoni: న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ సీఎస్కే స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ (MS Dhoni in IPL) నుంచి తప్పుకున్నట్టయితే.. తాను కూడా ఐపిఎల్‌కి గుడ్ బై చెబుతా అని సురేశ్ రైనా ప్రకటించాడు.
Happy Birthday MS Dhoni: ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టెస్టు విజయాలు, 110 వన్డే విజయాలు, 27 టీ20 విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌లో 17,226 పరుగులు సాధించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Suresh Raina About Greg Chappell: టీమిండియా ప్రధాన కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి, కానీ విజయాలు సాధించడానికి గల ప్రాముఖ్యతను ఆటగాళ్లకు వివరించిన కోచ్ చాపెల్ అని రైనా కితాబిచ్చాడు.
IPL 2021 CSK Captain MS Dhoni: అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోనీ అవతరించాడు. ఈ ఏడాది సైతం రూ.15 కోట్లు అందుకోనున్నాడు.
ఐపీఎల్ వచ్చాక క్రికెట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2020 వరకుగానూ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్ చేరిన భారత ఆటగాళ్లు. తాజా సీజన్ ఐపీఎల్ 2021లో సురేష్ రైనా ఈ జాబితాలో చేరనున్నాడు.
ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దాదాపు 7 నెలలపాటు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించలేదు. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించి పలువురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 10 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందులో అయిదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు వీరే..
Suresh Raina Arrested in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు.
యుఏఇలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్లే ఆఫ్స్ ( IPL 2020 playoffs ) రేస్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఐపిఎల్ 2020లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ( Kings XI Punjab ) 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్ నుంచి వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరిగొచ్చేసి షాకిచ్చాడు సురేష్ రైనా (Suresh Raina Out from IPL 2020). దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రైనా సేవల్ని కోల్పోయింది. రైనా వస్తాడని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
Ambati Rayudu in IPL 2020: ఐపిఎల్ 2020కి మరెంతో దూరంలో లేదు. ఇంకో వారం రోజుల్లోనే ఆ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. 13వ ఐపీఎల్ సీజన్లో పాల్గొనేందుకు అన్ని జట్లు సిద్ధం అవుతున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) మాత్రం సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ( Suresh Raina, Harbhajan Singh ) రూపంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.