Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. కొత్తగా 1,500 లోపే కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Omicron in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే కరోనా బారిన పడిన వారిలో దాదాపు 90 శాతం మందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
IIT Hyderabad Corona: హైదరాబాద్ లోని ఐఐటీలో కరోనా కలవరం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
Telangana Schools Closed: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా జనవరి 8 నుంచి 16 వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడే లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ కు వివరించారు.
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 482 కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మరణించారు. మరోవైపు 212 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటిన్ ద్వారా వెల్లడించింది.
Omicron Case in Hyderabad: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.