గత వారం ఉత్తర తెలంగాణలో భారీగా కురిసిన వర్షాలు ఇప్పుడు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. పలుచోట్ల కాలనీల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం..
Fruits Washed Away in Batasingaram Market: హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మార్కెట్లోకి భారీగా వరద నీరు రావడంతో పండ్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి.
Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి ముసురు కమ్మేసింది.
Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం (జూలై 17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
Telangana Floods: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది.
Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 68.30 అడుగులకు చేరింది.
Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది
Godavari Floods: తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Telanagana Floods: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే 20 సెంటిమీటర్లకు పైగా వర్షం కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది.నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో ప్రమాదంలో పడింది. అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది. వారం రోజులైనా సూర్యుడు జాడే లేకుండా పోయాడు. జోరు వానలతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.