NTR Health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.
17 New Medical Colleges in AP: ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి విడదల రజని అన్నారు. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
AP Assembly Sessions 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. పయ్యావుల కేశవ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం ఎదుట నిరసన చేపట్టారు. స్పీకర్ ఎంత వారించినా టీడీపీ ఎమ్మెల్యేలు వినకపోవడంతో ఏపీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకున్నారు.
Kodali Nani Speech: 16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన ఉందన్నారు.
ఏపీలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఇటీవలే సీఎంకు చేరినట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
YSR Death Anniversary 2022: వైఎస్ఆర్ వర్థంతి నేడు.. జనం మెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్ లైఫ్‌పై స్పెషల్ స్టోరీ.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
CM YS Jagan said that till now 11 thousand 715 crores have been provided directly under Jagananna Vidya Divena and Dorm Divena. No family should be in debt for education.
Jagananna Thodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..జగనన్న తోడు పధకం నిధులు ఇవాళ విడుదల చేశారు. చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవని కొనియాడారు. చిరు వ్యాపారు, హస్తకళాకారులు వంటివారికి వడ్డీ లేని రుణాలు అందించడమే ఈ పధకం ఉద్దేశ్యం.
YSR KAPU NESTHAM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్‌ను కొట్టివేసింది. దీంతో వాన్‌పిక్ సంస్థకు ఊరట లభించినట్లయింది.
AP Fiber News, AP Govt to Launch Own TV News Channel. ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.