Xiaomi 15 Pro Price: షావోమీ నుంచి మరో 2 సూపర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Xiaomi 15 Pro Price: షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి మరో రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 9, 2024, 03:01 PM IST
Xiaomi 15 Pro Price: షావోమీ నుంచి మరో 2 సూపర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Xiaomi 15 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి రెండు స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను Xiaomi 15తో పాటు Xiaomi 15 Pro పేర్లతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అక్టోబర్‌ నెలలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉండబోతోంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌పై పని చేసే మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే లాంచింగ్‌ సమయానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ  స్పెసిఫికేషన్‌లు Weibo పోస్ట్‌ ద్వారా లీక్‌ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, లీక్‌ అయిన స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ Xiaomi 15, Xiaomi 15 Pro స్మార్ట్‌ఫోన్స్‌ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఈ Xiaomi 15 స్మార్ట్‌ఫోన్‌ 6.36-అంగుళాల OLED ప్యానెల్‌ డిస్ల్పే సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 1.5K రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రో వేరియంట్‌లో మాత్రం 6.73 అంగుళాల 2K OLED డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.

ఈ Xiaomi 15 Pro స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు గరిష్టంగా 1400 నిట్‌ల బ్రైట్‌నెస్‌ సెటప్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బేస్ వేరియంట్ 4800mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 100 వాట్ వైర్డు ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ Xiaomi 15 మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇక Xiaomi 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండడమే కాకుండా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఇవే కాకుండా అదనంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ ఫ్రంట్‌ భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రో వేరియంట్‌కి అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News