CM KCR meets Colonel Santosh Babu`s family: సూర్యాపేట: ఇండో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ( Colonel Santosh Babu ) కుటుంబసభ్యుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఎప్పుడు, ఎలాంటి అసవరమొచ్చినా తమను సంప్రదించాలని... ఎల్లప్పుడూ అండగా ఉంటామని కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించారంటూ కల్నల్ సంతోష్ బాబు ( Col.Santosh Babu ) దైర్యసాహసాల్ని కేసీఆర్ కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు.
దేశం కోసం ప్రాణాలొడ్డిన సంతోష్ బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని కేసీఆర్ చెప్పారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని సంతోష్ బాబు భార్య సంతోషికి స్వయంగా కేసీఆర్ అందించారు. మరోవైపు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆమెకు అందించారు. అంతేకాకుండా సంతోష్ బాబు భార్యకు 4 కోట్ల రూపాయల చెక్‌ను... సంతోష్ తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందించారు.