CM KCR: కల్లుగీత కార్మికులకు శుభవార్త.. ప్రత్యేక పథకం ప్రకటించిన సీఎ కేసీఆర్

Geetha Workers Insurance: కల్లుగీత కార్మికులకు అండగా నిలబడేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు బీమా పథకం తరహాలో గీత కార్మికుల బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : May 2, 2023, 09:34 PM IST
CM KCR: కల్లుగీత కార్మికులకు శుభవార్త.. ప్రత్యేక పథకం ప్రకటించిన సీఎ కేసీఆర్

Geetha Workers Insurance: మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కల్లుగీత కార్మికులకు గీత కార్మికుల బీమా పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తరహాలోనే ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. కల్లుగీస్తూ  ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సాయాన్ని అందజేస్తామని చెప్పారు. ఈ బీమా డబ్బులు నేరుగా మృతుడి కుటుంబ సభ్యుల ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

నూతన సచివాలయం ప్రారంభం తరువాత సీఎం కేసీఆర్ నిత్యం సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. మంగళవారం  సంబంధిత శాఖల అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ కార్మికులు జారిపడి ప్రాణాలు  కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా.. అయితే ఈ డబ్బులు బాధితులకు అందడంలో ఆలస్యం జరుగుతోంది. అందుకే అన్నదాతలకు అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో.. గీత కార్మికుల బీమా పథకం అమలు చేయాలి. కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా చర్యలు చేపడతాం. ఇందుకు సంబంధించి అధికారులు, మంత్రులు చర్యలు చేపట్టాలి..' అని సీఎం కేసీఆర్ సూచించారు.

అకాల వర్షాలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి వరి ధాన్యం సేకరణ, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు, వ్యవసాయశాఖ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌ రావు, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?  

Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News