Telangana Covid-19: 1100 లకు చేరిన కరోనా మరణాల సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా రెండువేలకు తక్కువగానే కేసులు నమోదయ్యాయి.

Last Updated : Sep 27, 2020, 10:02 AM IST
Telangana Covid-19: 1100 లకు చేరిన కరోనా మరణాల సంఖ్య

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా రెండువేలకు తక్కువగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో శనివారం ( సెప్టెంబరు 26 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా కేసులు నమోదు కాగా.. 9 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,85,833 కి చేరగా.. మరణాల సంఖ్య 1,100 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,54,499 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 30,233 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Ram Gopal Varma: ఆసక్తికరంగా దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 50,108 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 28,50,869 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 83.13 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 297 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

telangana corona cases bulletin

Trending News