Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిత్యం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతుండటంతోపాటు.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో సోమవారం ( అక్టోబరు 19 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,24,545 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,282 కి చేరింది. Also read: Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,891 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,02,577 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20,686 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 90.21 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతం ఉంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 42,299 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు 38,98,829 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 112, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 102 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి... Also read: Haj 2021: ఆ తర్వాతే హజ్ యాత్రపై నిర్ణయం: కేంద్ర మంత్రి నఖ్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe