Road Accident: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం... దంపతుల మృతి...

Couple dies in road accident in Narsingi: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాద ఘటన మరవకముందే నార్సింగి పరిధిలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 07:24 PM IST
  • హైదరాబాద్ శివారు నార్సింగిలో రోడ్డు ప్రమాదం
  • అక్కడికక్కడే మృతి చెందిన దంపతులు
  • నిందితుడు సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Road Accident: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం... దంపతుల మృతి...

Couple dies in road accident in Narsingi: హైదరాబాద్ (Hyderabad) శివారులోని నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ దంపతులను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతి చెందిన దంపతులను రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ దంపతులు స్కూటీపై నార్సింగి నుంచి గచ్చిబౌలి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎంజీఐటీ వద్దకు చేరుకున్న సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టినట్లు (Speedyy Car hits scooty) తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ‌సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నామని... మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. మృతురాలు మౌనిక నార్సింగి మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆమె మృతిపై మున్సిపల్ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. 

రాజు, మౌనికల మృతిపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో (Road Accident) గాయపడిన మౌనిక, రాజులను ఎవరూ పట్టించుకోలేదని తెలిసిందన్నారు. చివరకు, ఎవరో తెలిసిన వ్యక్తులు అంబులెన్సుకు ఫోన్ చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. కానీ అప్పటికే ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. మౌనిక-రాజు దంపతుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోనూ (Hyderabad Road Accident) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మందుబాబుల రాష్ డ్రైవింగ్‌కు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Mystery Hut on Moon: చంద్రుడి ఉపరితలంపై 'మిస్టరీ హట్'.. గుర్తించిన చైనా మూన్ రోవర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News