Covid-19 Telangana: తెలంగాణ లో 24 గంటల్లో 1,718 కరోనా కేసులు

ఒక వైపు భారత దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రజలు మరణించగా.. మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు బాగా పెగుతోంది.

Last Updated : Oct 3, 2020, 10:19 PM IST
    • ఒక వైపు భారత దేశంలో కరోనావైరస్ వల్ల ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రజలు మరణించగా..
    • మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి.
    • కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు బాగా పెగుతోంది.
Covid-19 Telangana: తెలంగాణ లో  24 గంటల్లో 1,718 కరోనా కేసులు

ఒక వైపు భారత దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రజలు మరణించగా.. మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు బాగా పెగుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నేడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కేవలం 1,718 కేసుల మాత్రమే నమోదు అయ్యాయి. కాగా 2,002 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అయితే  గత 24 గంటల్లో 18 మంది వైరస్ సంక్రమణ వల్ల మరణించారు. 

ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్

గత 24 గంటల్లో నమోదు అయిన కేసులను కలిపితే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య లక్షా 97 వేల 327కు చేరుకుంది.  ఇప్పటి వరకు కోవిడ్-19 ( Covid-19 ) నుంచి కోలుకుని లక్షా 67 వేల 846 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఒక మరణాల సంఖ్య  1,153 కు చేరుకుంది.  

కాగా గత 24 గంటల్లో 49,084 మందికి పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య రాష్ట్రంలో 31,53,626 కు చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 85.05 శాతం కాగా, మరణాల రేటు 0.58గా ఉంది.

ALSO READ| Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News