Bhatti Vikramarka: రాష్ట్రం అప్పు రూ.ఐదున్నర లక్షల కోట్లు.. ఛాలెంజ్‌గా ఆర్థిక శాఖ తీసుకున్నా: భట్టి విక్రమార్క

Finance Minister Bhatti Vikramarka: రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. అయినా ఛాలెంజ్‌గా తాను ఆర్థిక శాఖను తీసుకున్నానని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు అధికారులు కమిట్‌మెంట్‌తో పని చేయాలని సూచించారు. హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Dec 9, 2023, 07:49 PM IST
Bhatti Vikramarka: రాష్ట్రం అప్పు రూ.ఐదున్నర లక్షల కోట్లు.. ఛాలెంజ్‌గా ఆర్థిక శాఖ తీసుకున్నా: భట్టి విక్రమార్క

Finance Minister Bhatti Vikramarka: రాష్ట్ర సచివాలయం ఫైనాన్స్ శాఖ కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర  అప్పుల గురించి భట్టి విక్రమార్కకు వివరించారు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సంపద సృష్టించడం.. సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖపైన ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలన్నారు.

ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్‌మెంట్‌తో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అయినప్పటికీ ఛాలెంజ్‌గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దాం. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారంటీలు అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించాం.

ఇండ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదివిన కొలువులు రాకపోవడంతో పెళ్లిళ్లలో క్యాటరింగ్ సప్లయర్స్‌గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశాను. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు. హ్యూమన్ రిసోర్స్‌పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలి. హ్యూమన్ రిసోర్స్‌ను బలోపేతం చేసుకోవడం వల్ల జీఏడీ పెరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండింటి అమలు చేశాం.. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాం. ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నాం.. మిగతా గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలి.." భట్టి విక్రమార్క దిశా నిర్దేశం చేశారు.

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News