DK Aruna vs Revanth Reddy: ఉద్యోగుల సమావేశంలో పరిపాలనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా పాలమూరు ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలన చేతకాకుంటే ముక్కు నేలకు రాసి దిగిపోవాలని సంచలన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేతగానితనంపై ఆగ్రహం వ్యక్తం చేశాఉ. రైతు భరోసా పేరిట మరోసారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read: KT Rama Rao: 'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి'
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఎంపీ డీకే అరుణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ చేతగాని పాలనపై నిప్పులు చెరిగారు. 'రైతులను మోసం చేస్తాం.. హామీలు మమ అనిపిస్తామంటే, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటాను అంటే ఊరుకోం' అని హెచ్చరించారు. మోసకారి కాంగ్రెస్ రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి నిండా ముంచిందని మండిపడ్డారు. 'ఎన్నికలకు ముందు రూ.15 వేలు చెప్పి ఇప్పుడు ఎందుకు రూ.12 వేలు ఇస్తామంటున్నారని నిలదీశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్రం అప్పుల పాలైందని ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డికి తెలియదా? అని ఎంపీ అరుణ ప్రశ్నించారు. 'కాంగ్రెస్ ఎన్నికల కు ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా మోసం చేసింది. రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. రైతులను మోసం, దగా చేస్తున్నారు. మాట తప్పినందుకు రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
'రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని ఆనాడు తెలియదా? కుర్చీ కోసమే అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆనాడే మేం చెప్పాం. రైతు భరోసా ఎంత మందికి ఇస్తారో కూడా అనుమానమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయానికే ఈ ప్రకటన చేశారు' అని అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుందనే ఇంటెలిజెన్స్ నివేదిక మేరకే రైతు భరోసా ప్రకటన చేశారని తెలిపారు. ముక్కు నేలకు రాసి రైతులకు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చే వరకు వదిలేదే లేదని స్పష్టం చేశారు.
ఇక తనపై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న అసభ్య పోస్టులపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పేవి నీతులు.. సోషల్ మీడియాలో బూతులా? అని ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే వారి పనికిమాలిన సోషల్ మీడియాలో బూతులు తిట్టిస్తావా? చదలేని రీతిలో బూతులు.. నోటికొచ్చిన మాటలు ఉంటున్నాయి' అని తెలిపారు. ఇదేనా రేవంత్ రెడ్డి నీ పనికిమాలిన నీతి అని ఎంపీ అరుణ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook