Solar Power: తెలంగాణ మహిళలకు సువర్ణావకాశం.. గృహిణి నుంచి పారిశ్రామికవేత్తగా ఛాన్స్‌

Telangana Women Industrialist Chance With Solar Power Production: సాధారణ గృహిణిగా ఉన్న మహిళలను తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 15, 2024, 07:33 PM IST
Solar Power: తెలంగాణ మహిళలకు సువర్ణావకాశం.. గృహిణి నుంచి పారిశ్రామికవేత్తగా ఛాన్స్‌

Solar Power Production: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తాము అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవకాశం కల్పించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తాము ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. ఇందిరా మహిళా శక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వారి ద్వారా జరగాలని లక్ష్యం నిర్దేశించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Ethanol Industry: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం

 

ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శుక్రవారం అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు మహిళలకు ఇవ్వడంపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూత అందించాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

Also Read: Kishan Reddy: రేవంత్‌ రెడ్డి ఛాలెంజ్‌కు కిషన్‌ రెడ్డి సై.. రేపు మూసీ ఒడ్డున నిద్ర.. భోజనం

 

స్వయం సహాయక సంఘాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ ఉత్పత్తికి త్వరితగతిన చర్యలు ప్రారంభించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని చెప్పారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చడంపై మరింత ముందుకు వెళ్తామి తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇవ్వడంతో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో మహిళలు ఎదిగి సామాజిక మార్పు సాధ్యమవుతుందని అభిలషించారు.

స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా.. సామాజికంగా బలోపేతమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో అమలు చేయాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News