GHMC Elections: గ్రేటర్ ఎన్నికల స్టేపై నిరాకరించిన హైకోర్టు

Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.

Last Updated : Nov 17, 2020, 10:58 AM IST
    1. గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది.
    2. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల స్టేపై నిరాకరించిన హైకోర్టు

GHMC Elections | గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధం అవుతున్న తరుణంలో స్టే విధించలేము అని కోర్టు తెలిపింది. రిజర్వేషన్ల రొటేషన్ తరువాత జీహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించాల్సిందిగా దసోజు శ్రవణ్ తన పిటీషన్ లో కోర్టును కోరారు.

Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

సుప్రీం కోర్టు ( Supreme Court ) ఆదేశాలకు పాటించకుండా బీసీ రిజర్వేషన్లను అమలు చేశారు అని పిటీసన్ లో పేర్కోన్నారు. రాజకీయంగా వెనకబడిన వర్గాల వారికి గుర్తింపు లేకుండా పోతుంది అని పిటీషన్ లో తెలిపారు.

ఈ పిటీషన్ పై స్పందించిన కోర్టు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ( MBC ) గురించి గత 10 సంవత్సరాలుగా ఎందుకు స్పందించలేదు అని పిటీషనర్ ను ప్రశ్నించింది. ఎన్నికలపై ఎలాంటి స్టేను విధించడం లేదు అని విచారణ కొనసాగుతుంది అని తెలిపింది. దీనిపై కౌంటర్ ఎఫిడెవిట్ దాఖలు చేయాలి అని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వం, జీహెచ్ఎంసిని సూచించింది కోర్టు.

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News