కొత్త సంవత్సరం వేడుకలు.. మందుబాబులకు సీపీ హెచ్చరికలు !

కొత్త సంవత్సరం వేడుకలు.. మందుబాబులకు సీపీ హెచ్చరికలు !

Last Updated : Dec 31, 2018, 07:31 PM IST
కొత్త సంవత్సరం వేడుకలు.. మందుబాబులకు సీపీ హెచ్చరికలు !

హైదరాబాద్‌: నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుంచే మూసివేయాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఎటువంటి అపశృతి దొర్లకుండా ఉండేందుకు తీసుకునే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఆదేశాలు జారీ అయ్యాయని స్పష్టంచేసిన సీపీ అంజనీ కుమార్... పౌరులు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. 

టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతకు తల్లిదండ్రులు బైక్‌లు ఇవ్వొద్దని సీపీ సూచించారు. నగరంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవని ఆయన మందుబాబులకు హెచ్చరికలు జారీచేశారు.

Trending News