తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన

తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన

Last Updated : Sep 4, 2019, 03:30 PM IST
తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Trending News