Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గత 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్, కరీంనగర్, పెద్దల్లి, జనగాం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వనపర్తిస సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వరంగల్ జిల్లా దుగ్గండిలో అత్యధికంగా 116 మిల్లిమీటర్ల వర్షం కురిసింది, వికారాబాద్ జిల్లా తాండూరులో 68, కామారెడ్డి జిల్లా సోమూరులో 64, జనగామ జిల్లా కలకొండలో 59, ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటవో 55 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా తాండూరు, మహబూబ్ నగర్ జిల్లా మాచన్ పల్లి, మహబూబ్ నగర్ టౌన్ లో 50 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. హైదరాబాద్ లోనూ రాత్రి నుంచి ముసురు పట్టింది. రెండు రోజుల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Old lady on Jr NTR: నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? ఎన్టీఆర్ పై వృద్ధురాలు షాకింగ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook