విమానం అత్యవసర ల్యాండింగ్: విమానంలో ఏపీ స్పీకర్ కోడెల, మాజీ మంత్రి ఆనం!

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

Last Updated : Aug 23, 2018, 02:02 PM IST
విమానం అత్యవసర ల్యాండింగ్: విమానంలో ఏపీ స్పీకర్ కోడెల, మాజీ మంత్రి ఆనం!

శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి బయల్దేరిన విమానంలో టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాన్ని మళ్లీ హైదరాబాద్‌కి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. ఈ ఇండిగో విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రావు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా ఇతర రాజకీయ నాయకులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు అందరూ సురక్షితంగా కిందికి దిగినట్టు ఎయిర్ పోర్ట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. 
 

Trending News