Revanth Reddy: కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ.. మునుగోడు పాదయాత్రకు వచ్చేనా?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో మరో కీలక పరిణామం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు.

Written by - Srisailam | Last Updated : Aug 13, 2022, 02:32 PM IST
  • తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం
  • కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ
  • ఇవాళ మునుగోడులో రేవంత్ పాదయాత్ర
Revanth Reddy: కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి  బహిరంగ క్షమాపణ.. మునుగోడు పాదయాత్రకు వచ్చేనా?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో మరో కీలక పరిణామం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికీ మంచిది కాదన్నారు. అద్దంకి దయాకర్ పై చర్యలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి వెంకట్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు రేవంత్ రెడ్డి. ఆయనపై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి.. ఆ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారని ఆరోపించారు. తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ తగ్గిందనే వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీలో మళ్లీ దుమారం రేపింది. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి.కోమటిరెడ్డిని ఉద్దేశించి బ్రాండ్ కాదు బ్రాందీ షాపుకు కూడా పనికి రారంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ వస్తున్నారు వెంకట్ రెడ్డి. ఢిల్లీలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో తమ్ముడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది.

అయితే తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను ఖండించిన వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై మాత్రం మాటల దాడి పెంచారు. అటు మునుగోడుఫై ఫోకస్ చేసిన పీసీసీ చండూరులో బహిరంగ సభ నిర్వచింది. రేవంత్ రెడ్డి పాల్గొన్న ఆ సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు. అద్దంకి వ్యాఖ్యలపై పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. వెంటనే దయాకర్ క్షమాపణ చెప్పినా.. వెంకట్ రెడ్డి మాత్రం కూల్ కాలేదు. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి తనను కావాలనే అవమానిస్తూ పార్టీనుంచి వెళ్లగొట్టాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి... చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగ క్షణమాప చెబుతున్నానని చెప్పారు.

Read Also: Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఇవాళ 169 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..  

Read Also: Munugode Byelection: ఎన్నికల షెడ్యూల్ రాకముందే మునుగోడుకు కేసీఆర్.. ఓటమి భయమా.. అసమ్మతికి చెక్ పెట్టడమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News