Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్.. ప్రతిపక్షాల్లో ముసలం.. కేటీఆర్ కీ రోల్..?

BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ముసలం నెలకొంది. అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయాల్సింది పోయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్‌లో అసంతృప్తి నేతల దారేటు..? వీరి వ్యాఖ్యల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా..?

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 06:36 PM IST
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్.. ప్రతిపక్షాల్లో ముసలం.. కేటీఆర్ కీ రోల్..?

BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. అయితే ఎక్కడైనా అధికార పార్టీలో అసమ్మతి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆ పార్టీ సీనియర్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కమలం పార్టీ నేతలు నోరెత్తడమే అరుదు.. అదీ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గళమెత్తడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే బీజేపీలో విభేదాల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారనే చర్చ సాగుతోంది. మంత్రితో టచ్‌లోకి వెళ్లిన కొందరు కమలం నేతలు.. బండిని టార్గెట్ చేశారని అంటున్నారు.  

పార్టీ హైకమాండ్ ఆదేశాలు గీత దాటని కమలం నేతలు.. ఏకంగా పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. అర్వింద్ ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే  మరో సీనియర్ నేత పేరాల శేఖర్ జీ.. బండి సంజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు. అర్వింద్, పేరాల తీరు తెలంగాణ బీజేపీలో ముసలం రేపింది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. కమలం నేతలు రెండుగా చీలిపోయారనే టాక్ వస్తోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కమలం పార్టీ తీరుపై గుస్సాగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అవ్వగా.. ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. తనకు చేరికల కమిటీ కన్వీనర్ పదవి అవసరం లేదని అమిత్ షాకు నేరుగానే ఈటల చెప్పారని సమాచారం. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకుండా చేరికల కమిటీతో తానేమి చేయలేనని తేల్చి చెప్పేశారట. పరోక్షంగా బండి సంజయ్ తీరును తప్పుపడుతూ అమిత్ షాకు సిగ్నల్ ఇచ్చారట రాజేందర్. ఆ సమావేశంలోనే బండికి మద్దతుగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారట. చేరికల కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని అమిత్ షాకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈటల మరింత వాయిస్ పెంచారని అంటున్నారు. 

టికెట్ హామీ లేకుండా నేతలు ఎలా జాయిన్ అవుతారని ప్రశ్నించారని సమాచారం. తనకు కన్వీనర్ పదవి అవరసం లేదని మరోసారి స్పష్టం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాతే ఎంపీ అర్వింద్ రంగంలోకి దిగారని అంటున్నారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ఎంపీ. కవితను ఎక్కువగా టార్గెట్ చేసే అర్వింద్.. ఆమెకు మద్దతుగా ఏకంగా తమ పార్టీ చీఫ్‌ను తప్పబట్టడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే అర్వింద్.. బండి సంజయ్‌ను కార్నర్ చేశారని తెలుస్తోంది. 

అయితే బీజేపీలో జరుగుతున్న పరిణామాల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలోని సంజయ్ వ్యతిరేక వర్గం నేతలతో కేటీఆర్ టచ్‌లోకి వెళ్లారని టాక్. ఈటల రాజేందర్, ఎంపీ అర్వింద్‌లు కొన్ని రోజులుగా కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రితో అత్యంత సన్నిహితంగా మెలిగారు ఈటల రాజేందర్. ఆయనతో సరదాగా గడిపారు. సభలోనూ కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఈటల మాట్లాడారు. సీఎం కేసీఆర్ కూడా రాజేందర్‌ను అభినందించారు. ఇదంతా కేటీఆర్ ఆపరేషన్ కారణంగానే జరిగిందంటున్నారు. బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని భావిస్తున్న రాజేందర్.. అధికార బీఆర్ఎస్ పార్టీకి క్రమంగా దగ్గరవుతున్నారని అంటున్నారు. ఈటల బాటలోనే ఎంపీ అర్వింద్ కూడా నడుస్తున్నారని.. అందుకే డైరెక్ట్‌గా సంజయ్‌ను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కవితకు వ్యతిరేకంగా అర్వింద్ మాట్లాడటం లేదు. ఈడీ విచారణకు కవిత హాజరైనా అర్వింద్ స్పందించలేదు. దీంతో బీజేపీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే వాదనలకు బలం చేకూరుతోంది. కేటీఆర్ రాడార్‌లో ఉండటం వల్లే ఈటల, అర్వింద్ రూట్ మారిందనే టాక్ వస్తోంది. 

అంతర్గత విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్‌ పార్టీ అని అందరికీ తెలిసిందే. ఈ విభేదాలు కంటిన్యూ అవుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూడా కేటీఆర్ డైరెక్షన్‌లో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ఇటీవల దూకుడు పెంచారు. కేటీఆర్‌తో టచ్‌లోకి వెళ్లాకే మహేశ్వర్ రెడ్డి.. రేవంత్‌కు వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. రేవంత్ వ్యతిరేకులుగా ముద్రపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు కూడా కేటీఆర్‌తో రహస్యంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. రేవంత్‌కు పోటీగా భట్టి పాదయాత్రకు ప్లాన్ చేయడం.. ఆ యాత్రకు మహేశ్వర్ రెడ్డి సహా కొందరు సీనియర్ నేతలు మద్దతు తెలపడం.. అంతా కేటీఆర్ ప్లాన్‌లో భాగంగానే జరుగుతుందని అంటున్నారు. కొన్నిరోజులుగా పార్టీలో రెబెల్‌గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా భట్టి యాత్రకు సపోర్ట్ చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను గ్రహించడం వల్లే రేవంత్ రెడ్డి... పార్టీలోని పెద్ద రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని కామెంట్ చేశారని అంటున్నారు. 

మొత్తంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీ నేతలను తన కార్నర్‌లో ఉంచుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు జరుగుతాయని అంటున్నారు. చూడాలి మరీ బీజేపీ, కాంగ్రెస్‌ లోని అసమ్మతి ఎటు వైపు దారి తీస్తుందో..!

Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి

Also Read: Kisan Vikas Patra: రైతులకు వరం కిసాన్ వికాస్ పత్ర.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News