CM Revanth reddy review on implementation of farmers crop loan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ లో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా.. రైతులకు ఎన్నికల ముందు రుణమాఫీ హమీని అమలు చేసే దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి.. ఎంపీ ఎన్నికల ప్రచారంలో.. ఆగస్టు పదిహేను నాటికి రుణమాపీ చేస్తానంటూ తెలంగాణలోని.. ఫెమస్ దేవుళ్ల ఆలయాల మీద ఓట్లు వేసిన మరీ చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ సమావేశంలో.. పంట రుణమాఫీతో పాటు మరికొన్ని అంశాలపై చర్చలు జరిపారు.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
ఇదిలా ఉండగా.. తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పేందుకు, కాంగ్రెస్ సర్కారు రెడీ అవుతుంది. గతంలో చెప్పిన విధంగానే.. ఆగస్టు 15వ తేదీలోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను అధికారికంగా ఆమోదించనున్నట్టు సమాచారం. దీనితో పాటు.. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో.. సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన అన్ని వివరాలను సీఎం రేవంత్ సేకరించినట్లు సమాచారం.
2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించేలా ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేస్తోంది. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం ఇప్పటికే అధికారులు.. బ్యాంకర్లతో చర్చలు జరిపారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం మేరకు రుణమాఫీ చేయనున్నారు. అయితే.. రుణమాఫీ అమలుపై కొన్ని ప్లాన్ లు ఇప్పటికే సిద్ధం చేశారు. దీన్నిఈనెల18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేయగా.. ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకురానున్నారనే అంశంపైనా రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
సర్కారు బడులపై సూచనలు..
తెలంగాణలోని సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను క్లోజ్ చేయకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ పాఠశాలలను సరిగా పట్టించుకోలేదని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను, రూ. 2వేల కోట్లతో మరల పనులు చేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని గుర్తుచేశారు. తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter