Telangana Covid-19: కొత్తగా 805 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Last Updated : Nov 29, 2020, 09:29 AM IST
  • తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
  • రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు.
  • ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.56 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.
Telangana Covid-19: కొత్తగా 805 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 28న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,69,223 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,455 కి చేరింది. 

telangana corona cases bulletin

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 948 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,57,278 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.56 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Sai Dharam Tej: థియేటర్లల్లో సోలోగా సందడి చేయనున్న మెగా మేనల్లుడు

ఇదిలావుంటే.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 46,280 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 28వ తేదీ వరకు మొత్తం 54,20,421 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 131 కేసులు నమోదయ్యాయి.  Also read: Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్

Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News