తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో విద్యార్థులు చేరడానికి రాసిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎంసెట్) ఫలితాలు శనివారం సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎంసెట్ పరీక్షల కన్వీనరు ఆచార్య యాదయ్య ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు 1,36,311 అభ్యర్థులు, అగ్రికల్చర్ పరీక్షలకు 66,857 అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 25వ తేది నుండి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 28వ తేది నుండి జూన్ 6వ తేదిన వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా ఉంటుంది. జూన్ 8వ తేదిన సీట్లను కేటాయిస్తారు. ఇక ఎంసెట్ ఫలితాలను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు www.eamcet.tsche.ac.in వెబ్ సైటులో వీక్షించవచ్చు.