Telangana: రూ.కోటి 10లక్షలు లంచం.. ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్

తెలంగాణ (Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Last Updated : Aug 15, 2020, 08:12 AM IST
Telangana: రూ.కోటి 10లక్షలు లంచం.. ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్

Keesara MRO Nagaraju caught by ACB: హైదరాబాద్‌: తెలంగాణ ( Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్‌గా పట్టుకున్నారు. భూ వివాద పరిష్కారానికి 2 కోట్ల రూపాయల లంచం డిమాండ్‌ చేసి.. కోటి 10లక్షల రూపాయలు తీసుకుంటున్న మేడ్చల్‌-మల్కాజిగిరి (Medchal–Malkajgiri ) జిల్లా కీసర మండల తహసీల్దార్‌ ఎర్వ బాలరాజు నాగరాజు ( Erva Balaraju Nagaraju ) ను ఏసీబీ అధికారులు అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. దీంతోపాటు తహసీల్దార్‌కు లంచం ఇచ్చిన ఇద్దరు రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లను, వీఆర్ఏను సైతం అధికారులు అరెస్టు చేశారు. Also read: Allan Lichtman: 40 ఏళ్లుగా ఆయన జోస్యం నిజమైంది.. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే!

కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని సర్వేనంబర్లు 603 నుంచి 614 వరకు ఉన్న 53 ఎకరాలకు సంబంధించి ఎప్పటినుంచో భూ వివాదం కొనసాగుతోంది. ఈ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా మార్చేందుకు తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీనిగురించి ఏసీబీకి అధికారులకు తెలియడంతో శుక్రవారం సాయంత్రం ఏఎస్‌రావునగర్‌లోని తహసీల్దార్‌ నాగరాజు ఇంటివద్ద మాటువేశారు. అనంతరం రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ శ్రీనాథ్‌, ఏజెంట్‌ అంజిరెడ్డి తాహసీల్దార్‌ నాగరాజు ఇంట్లో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారితోపాటు రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌ను సైతం అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే పట్టుబడిన నగదును లెక్కించడానికే చాలా సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. మొత్తం రూ.100, రూ.500ల కట్టలు ఉండటంతో క్యాష్ కౌంట్ మిషన్‌ను తెప్పించి లెక్కించారు. నాగరాజుకు చెందిన అల్వాల్‌లోని నివాసంలో, కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఇదే తహసీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసులు నమోదై ఉన్నాయి. Also read: 74th Independence Day: ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరణ పూర్తి షెడ్యూల్

Trending News