Telangana Cabinet: సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరగనున్నాయి. ముగింపు వేడుకలను వచ్చే ఏడాది నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. 16న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందులో స్థానిక నేతలు, విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలు పాల్గొంటారు. సెప్టెంబర్ 17న పబ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదే రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో బంజారా ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం ఉండనుంది.
నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉండనుంది. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయనున్నారు. కవులు, కళాకారులకు గుర్తించిన సత్కరిస్తారు. తెలంగాణ స్ఫూర్తిని చాటేలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Also read:September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు..!
Also read:Asia Cup 2022: కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ బెటర్..భారత మాజీ పేసర్ హాట్ కామెంట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి