CM Revanth Reddy: తెలంగాణ సెక్రటేరియట్లో కొద్దిరోజులుగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక మార్పులు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాంబర్ ఆరో ప్లోర్లో ఉండేది. అప్పట్లో కేసీఆర్ అక్కడి నుంచి పాలన చేసేవారు. కేసీఆర్ ఎంతో ముచ్చటపడి సెక్రటేరియట్ నిర్మించుకున్న.. సెక్రటేరియట్‌కు వచ్చింది అతి తక్కువసార్లు మాత్రమే..! కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యూలర్‌గా సెక్రటేరియట్‌కు వెళ్లగం చేస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ కూడా వాస్తు పేరిట అనేక మార్పులు చేర్పులు చేశారు..
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరో ప్లోర్లో సీఎం చాంబర్ ఉండేది.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే సీఎం చాంబర్‌ను ఏడో ప్లోర్‌కు మార్చేశారు. అలాగే కేసీఆర్ ఈస్ట్ గేట్ వైపు గుండా సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అదే గేటు గుండా బయటకు వెళ్లేవారు. కానీ రేవంత్ రెడ్డి ఇందులోనూ మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్లో ప్రధానగేటును రేవంత్ సర్కార్ మూసి వేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. సెక్రటేరియట్లో లుంబిని పార్కుకు ఎదురుగా బాహుబలి గేట్‌ను పెట్టారు. ఇప్పుడా అదే గేట్‌ను సర్కార్ క్లోజ్ చేస్తోంది. ఇందుకోసం దాదాపు 3 కోట్ల రూపాయలు సైతం ఖర్చు చేస్తోంది. వాస్తవానికి ఈ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. దాన్ని మూసి వేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఇదే గేటు నుంచి రాకపోకలు సాగించారు.
ఇక సెక్రటేరియట్లో మార్పులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం రచ్చరచ్చ చేస్తోంది. కేవలం వాస్తుదోషాల పేరుతో కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ దుబారా చేస్తోందని విమర్శిస్తోంది. కేవలం కేసీఆర్‌పై అక్కసుతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. పాలన చేతకాక ముఖ్యమంత్రి రేవంత్ ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం అంతేధీటుగా జవాబిస్తోంది. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయలేదని తెలంగాణ తల్లిని కేసీఆర్ ఇన్నాళ్లు అవమానించారని అంటోంది. అందుకే డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని వైభవంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటులో భాగంగానే బాహుబలి గేట్ ను మూసివేస్తున్నామని సర్కార్ అంటోంది.
ఇక్కడ మరో వాదన సైతం లేకపోలేదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రేవంత్ ను ప్రతి అంశంలోనూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో రోజురోజుకు రేవంత్‌కు సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రికి సొంత పార్టీ నుంచి కూడా పదవి గండం ఉందనే ప్రచారం సైతం ఉంది. ప్రస్తుతమున్న స్థితిలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళితే పదవిగండం ఉందని తెలుస్తోంది. అందుకే సమస్యల పరిష్కారం కోసం గేట్లు మారుస్తున్నారనే చర్చ సైతం జరుగుతోంది. అయితే మరో 20 రోజుల్లోనే గేట్ల మూసివేత పనులు పూర్తి కానున్నాయి.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Also Read: RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter