Telangana: నదీ జలాల అంశంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంచిదే

అపెక్స్ కౌన్సిల్ ( Apex council ) సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వాగతించారు. నదీ జలా వినియోగం విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాల సందేహాల్ని నివృత్తి చేస్తామన్నారు.

Last Updated : Aug 19, 2020, 11:58 PM IST
Telangana: నదీ జలాల అంశంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంచిదే

అపెక్స్ కౌన్సిల్ ( Apex council ) సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( Telangana cm kcr ) స్వాగతించారు. నదీ జలా వినియోగం విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాల సందేహాల్ని నివృత్తి చేస్తామన్నారు.

నదీ జలాల వినియోగం ( River water ) విషయంలో కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ( Dispute between ap and telangana ) నెలకొంది. ఈ వివాదాన్న తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ ( Apex council meet on august 25 ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) స్వాగతించారు. ఆ సమావేశంలో నదీ జలాల విషయంలో కేంద్ర , ఏపీ ప్రభుత్వాల సందేహాల్ని నివృత్తి చేస్తామన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికుకున్న అభ్యంతరాల్ని కూడా సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు కేసీఆర్.  అపెక్స్ సమావేశం అజెండాలో చేర్చాల్సిన అంశాల్ని లేఖ ద్వారా కేంద్రానికి తెలియపరుస్తామన్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష ( Cm kcr review in pragathi bhavan ) నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు లేవనెత్తిన అన్ని సందేహాల్ని నివృత్తి చేసే విధంగా సమగ్ర సమచారాన్ని సిద్ధం చేయాలన్నారు కేసీఆర్. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్టుల్ని అవసరాల నిమిత్తం రీ డిజైన్ చేశాము తప్ప...కొత్తవేవీ నిర్మించడం లేదన్నారు. అటు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యల్ని గట్టిగా తిప్పికొట్టేలా అభ్యంతరం చెప్పాలని అధికార్లకు సూచించారు. Also read: Kerala: త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ప్రైవేటుపరంపై అభ్యంతరం

నీటి కేటాయింపులు లేకపోయినా.. అనుమతులు లేకపోయినా.. ట్రిబ్యునల్ అవార్డుకు ( Tribunal Award ) భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh government ) కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివేనని సిఎం  కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సిఎం చెప్పారు. Also read: Telangana: రైళ్లు నడిచుంటే ..పెను ప్రమాదమే జరిగుండేదా

Trending News