హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80శాతానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేడే రానా, మిహికాల నిశ్చితార్థం
హైదరాబాద్ నగరానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపకాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం (మే 20న) నిర్వహించిన ఈ సమీక్షకు హైదరాబాద్‌కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, GHMC మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 36-24-36తో సెగలు రేపుతోన్న అందం
అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో చాలా చోట్ల దాదాపుగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఇప్పటికే కొన్నిచోట్ల అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేశామన్నారు. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్